Ganguly: ఒడిషాలో గంగూలీకి తప్పిన ప్రమాదం!

by velandi.Saikiran |

టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. సౌరవ్ గంగూలీ

Ganguly: ఒడిషాలో గంగూలీకి తప్పిన ప్రమాదం!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. సౌరవ్ గంగూలీ సోదరుని ఫ్యామిలీ స్పీడ్ బోటు లో ప్రయాణించి... ప్రమాదానికి గురైంది. అయితే వెంటనే అక్కడ ఉన్నవారు అలెర్ట్ కావడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిస్సా లోని (Odisha) పూరి తీరంలో... సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహ శిష్ (Snehasish Ganguly) గంగూలీ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా కొట్టింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న స్నేహ శిష్ గంగూలీ అలాగే ఆయన భార్య అర్పిత గంగూలీ ఇద్దరు తాజాగా ఓ స్పీడ్ బోట్ లో ( Speed Boat) ప్రయాణించారు.

అయితే ఆ బోటు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారు అలర్ట్ అయి వాళ్లను కాపాడారు. దీంతో గంగులి ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన గురించి తెలియగానే.. టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పూరి బయలు దేరారు.

Next Story