SL vs BAN: మ్యాచ్ మధ్యలోకి పాము.. వచ్చిందా.. వదిలారా..? గ్రౌండ్‌లోకి 7 అడుగుల భారీ పాము

by Ramesh Naini |   (  Updated:2025-07-03 09:58:28  IST  )

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్‌లో పెద్ద పాము దర్శనమిచ్చింది.

SL vs BAN: మ్యాచ్ మధ్యలోకి పాము.. వచ్చిందా.. వదిలారా..? గ్రౌండ్‌లోకి 7 అడుగుల భారీ పాము
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ (Bangladesh), శ్రీలంక (Sri Lanka) మధ్య నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్‌లో పెద్ద పాము దర్శనమిచ్చింది. దీంతో మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపి, దాన్ని బయటికి పంపించారు. వివరాల్లోకి వెళితే.. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభ దశలోనే ఆ పామును గుర్తించారు. దాదాపు 7 అడుగుల పాము గ్రౌండ్‌లోని పాకుతూ పోవడం గమనించి వెంటనే ఆటను ఆపి.. పామును మైదానం నుంచి బయటకు పంపించి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పుడప్పుడు బంగ్లా ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో 'నాగిని డాన్స్' చేస్తుంటారు. దీంతో వారికి మద్దతుగా పాము గ్రౌండ్ లోకి వచ్చినట్టుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ మధ్యలోకి వచ్చిన పామును.. ఎవరైనా తీసుకొచ్చి వదిలి ఉంటారా? లేక తానంతట అదే వచ్చిందా? అనే అనుమానాలతో నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. కాగా, ఈ మ్యాచులో శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయింది.

Next Story