- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా పెళ్లి క్యాన్సిల్ అయింది.. స్మృతి మంధాన సంచలన ప్రకటన
టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానతో ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ నిశ్చితార్థం గణంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 23నే జరగాల్సిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానతో ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ నిశ్చితార్థం గణంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 23నే జరగాల్సిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ సమయంలో అనేక వార్తలు వినిపించాయి. అయితే పెళ్లి క్యాన్సిల్ అవ్వలేదని కేవలం వాయిదా పడింది అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది.
తన పెళ్లి క్యాన్సిల్ అయిందని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లో మంధాన... గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం.. అంటూ పేర్కొంది. దీంతో మంధాన పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు అయినట్టు క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉంటే స్మృతి పలాష్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. పలాష్ స్టేడియంలో ప్రపోజ్ చేయగా మంధాన అతడికి ఓకే చెప్పింది. తరవాత వీరిద్దరి ఫోటోలు క్యూట్ పెయిర్ అంటూ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి దగ్గరపడిన సమయంలో ముచ్చల్ మరో అమ్మాయితో చేసిన చాటింగ్ అంటూ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. దీంతో ముచ్చల్ ఎఫైర్ కారణంగానే మంధాన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంధాన తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లి వాయిదా పడిందని, కొద్దిరోజుల తరవాత జరుగుతుందని వార్తలు రాగా తాజాగా ఆ వార్తలకు స్టార్ ప్లేయర్ పులిస్టాప్ పెట్టేసింది.






