- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smriti Mandhana : వీరోచిత సెంచరీ.. 292 పరుగులకు భారత్ అలౌట్
భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య ఛడీగఢ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ జట్టు 292 పరుగులు అలౌట్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య ఛడీగఢ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ జట్టు 292 పరుగులు అలౌట్ అయింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు ప్రతిక రావల్, స్మృతి మందన జట్టుకు చక్కని ఆరంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే ప్రతిక రావల్ (25) గార్డ్నర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయింది. ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ మందన్నా ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టింది. ఏకంగా 91 బంతుల్లో 117 పరుగులు చేసి మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంనంతరం క్రీజ్‌లోకి వచ్చిన దీప్తి శర్మ (40), ప్రతికా రిచా ఘోష్ (29) సంయమనంతో ఆడారు. చివర్లో వచ్చిన స్నేహ్ రాణా 18 బంతుల్లో 24 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్ 3, గార్డ్‌నర్ 2, సదర్‌లాండ్, మెక్‌గ్రాత్, షట్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.






