- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చారిత్రక రికార్డును సొంతం చేసుకున్న స్మృతి మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్నారు. శనివారం ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టీ20లో శతకంతో చెలరేగిన ఆమె, టెస్టు, వన్డే, టీ20 — మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపిన మంధాన.. కేవలం 62 బంతుల్లో 15 బౌండరీలు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఇది ఆమె టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకం కావడం విశేషం. ఈ ప్రదర్శనతో ప్రపంచస్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఆమెకు స్థానం లభించింది.
స్మృతికి తోడుగా వచ్చిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వలన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్‌పై టీ20ల్లో భారత మహిళల జట్టు నమోదు చేసిన ఇది ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా నిలిచింది.






