- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Rankings : రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లిన స్మృతి మంధాన.. నం.1 బ్యాటర్‌కు చేరువలో
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా వెళ్తున్నది.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దిశగా వెళ్తున్నది. ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో ఆమె తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. ఒక్క స్థానం వెనక్కినెట్టి రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మంధాన సత్తాచాటింది. వరుసగా 41, 73, 135 రన్స్ చేసింది. ఈ నేపథ్యంలో తిరిగి 2వ ర్యాంక్‌ను సంపాదించిన ఆమె టాప్ ర్యాంక్‌కు చేరువులో ఉన్నది. మంధాన 738 పాయింట్స్‌తో ఉండగా అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్(773) కంటే కేవలం 35 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి టాప్-10లో ఉన్నది మంధాన మాత్రమే. టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా ఆమె 2వ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో సిరీస్ మొత్తానికి దూరంగా ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ స్థానంలో ఉండగా.. రెండో వన్డేల్లో తొలి శతకాన్ని నమోదు చేసిన రోడ్రిగ్స్ 2 స్థానాలు అధిగమించి 17వ ర్యాంక్‌కు చేరుకుంది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఎక్లోస్టోన్(ఇంగ్లాండ్) అగ్రస్థానంలో ఉండగా.. దీప్తి శర్మ ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్‌కు చేరుకుంది. యాషెస్ సిరీస్‌లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గార్డ్‌నెర్ వన్డేల్లో నం.1 ఆల్‌రౌండర్‌గా నిలిచింది. టాప్ పొజిషన్‌లో ఉన్న మారిజన్నె కాప్(సౌతాఫ్రికా) 2వ ర్యాంక్‌కు పడిపోయింది.






