Smriti Mandhana : వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా అవతరించిన స్మృతి మంధాన

by Harish |   (  Updated:2026-03-03 14:29:02  IST  )

Smriti Mandhana : వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా అవతరించిన స్మృతి మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డేల్లో తిరిగి నం.1 బ్యాటర్‌గా అవతరించింది. ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. స్మృతి ఒక్క స్థానం ఎగబాకి తిరిగి అగ్రస్థానం సాధించింది. 790 రేటింగ్ పాయింట్లతో సౌతాఫ్రికా ప్లేయర్ లారా వొల్వార్డ్(782)ను వెనక్కినెట్టింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్-10లో చోటు సంపాదించింది. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరుకుంది. మరో బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ 12వ స్థానంలో ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఏకంగా 10 స్థానాలు కోల్పోయి 29వ ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. బౌలింగ్ విభాగంలో కూడా 5 స్థానాలు కోల్పోయి 10వ స్థానంలో నిలిచింది. తెలుగమ్మాయి, స్పిన్నర్ శ్రీచరణి మూడు స్థానాలు కోల్పోయి 26వ స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ అలానా కింగ్ నం.1 బౌలర్‌గా నిలిచింది.

Next Story