- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Rankings : వన్డేల్లో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్న స్మృతి మంధాన
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో నం.1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో నం.1 స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్‌లో మంధాన అగ్రస్థానంలో నిలిచింది. అయితే, కొన్ని రోజులకే ఆమె స్థానాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ భర్తీ చేసింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో మంధాన హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. దీంతో ఆమె ఓ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని తిరిగి టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది. నం.1 బ్యాటర్‌గా నిలవడం మంధానకు ఇది నాలుగోసారి. త్వరలో ప్రారంభంగానున్న వరల్డ్ కప్‌కు ముందు నం.1 బ్యాటర్‌గా నిలవడం మంధానకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. నాట్ స్కివర్ బ్రంట్ రెండో స్థానానికి పడిపోయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 12వ స్థానంలో, జెమిమా రోడ్రిగ్స్ 15వ స్థానంలో నిలిచి టాప్-20లో ఉన్నారు. తొలి వన్డేలో రాణించిన ప్రతీక రావల్, హర్లీన్ డియోల్ కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ప్రతీక 4 స్థానాలు, హర్లీన్ ఐదు స్థానాలు ఎగబాకి వరుసగా 42, 43 స్థానాల్లో నిలిచారు. ఇక, బౌలర్లలో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా కూడా ఐదు స్థానాలు వెనక్కినెట్టి 16వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్-10 బౌలర్లలో భారత్ నుంచి దీప్తి శర్మ మాత్రమే ఉండగా.. ఆమె మూడు స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయింది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి 4వ స్థానంలో కొనసాగుతోంది.






