స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్...ఫోటోలు వైర‌ల్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-21 21:00:40  IST  )

అయితే ఈ నేపథ్యంలో స్మృతి మందాన, ప‌లాష్ ముచ్చ‌ల్ ఇద్దరు హల్దీ వేడుకల్లో ( Haldi ceremony) పాల్గొన్నారు.

స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్...ఫోటోలు వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana) వివాహ వేడుక షురూ అయింది. నవంబర్ 23వ తేదీ అంటే రేపు స్మృతి మందాన, ప‌లాష్ ముచ్చ‌ల్ ( Palash Muchhal) వివాహం చాలా గ్రాండ్ గా జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్మృతి మందాన, ప‌లాష్ ముచ్చ‌ల్ ఇద్దరు హల్దీ వేడుకల్లో ( Haldi ceremony) పాల్గొన్నారు.

అంతకు ముందు టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా స్మృతి మందాన‌తో కలిసి హల్దీ వేడుకల్లో పాల్గొని, చిందులు కూడా వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ సింగర్ ప‌లాష్ ముచ్చ‌ల్, స్మృతి మందాన ఇద్దరు కూడా గత 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అటు స్మృతి మందాన, ప‌లాష్ ముచ్చ‌ల్ వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. క్లిక్

Next Story