- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smriti Mandhana : వన్డేలలో నం.1 ర్యాంక్‌కు చేరువగా స్మృతి మంధాన
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వన్డేలలో రెండో ర్యాంక్‌కు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వన్డేలలో రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో స్మృతి ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 727 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. శ్రీలంక, సౌతాఫ్రికాలతో జరిగిన ట్రై సిరీస్‌ను భారత్ దక్కించుకోవడంలో మంధాన కీలక పాత్ర పోషించింది. శ్రీలంకతో ఫైనల్‌లో మెరుపు శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఐదు మ్యాచ్‌ల్లో 264 రన్స్ చేసి సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వార్డ్ట్ 738 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. అగ్రస్థానానికి స్మృతి కేవలం 11 పాయింట్ల దూరంలోనే ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే ఆమె త్వరలోనే టాప్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. 2019లో స్మృతి నం.1 ర్యాంక్‌లో నిలిచింది. మరో భారత బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి 13 స్థానాలు మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం 32వ ర్యాంక్‌లో ఉంది. ఇక, బౌలింగ్‌లో స్పిన్నర్ స్నేహ్ రాణా 4 స్థానాలను వెనక్కినెట్టి 34వ స్థానానికి చేరుకుంది. భారత్ తరపున దీప్తి టాప్ ర్యాంక్‌లో ఉంది. ఆమె 4వ స్థానాన్ని కాపాడుకుంది. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ ర్యాంక్‌కు చేరుకుంది.






