- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెంబర్ 1 ర్యాంకు కోల్పోయిన మంధాన!
వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 ర్యాంకును స్మృతి మంధాన కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్-సివర్ బ్రంట్ టాప్ ర్యాంకుకు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్: ఆరేళ్ల తర్వాత మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన టీమిండియా బ్యాటర్ స్మృతి మంధాన.. ఎక్కువ రోజులు ఆ స్థానంలో కొనసాగలేకపోయింది. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. ఇటీవల భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే సిరీసులో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్.. టాప్ ర్యాంకుకు చేరుకుంది.
ఈ సిరీసులో మూడు మ్యాచుల్లో మంధాన 115 పరుగులు చేయగా.. సివర్ 160 రన్స్ చేసింది. 2023 తర్వాత నాట్ సివర్ ఇలా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పది స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు చేరుకుంది. జెమీమా రోడ్రిగెజ్ కూడా రెండు స్థానాలు మెరుగై 13వ స్థానానికి చేరింది. బౌలర్లలో దీప్తి శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.






