ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇంకా తీయ‌లేదా? స్మృతి ఫోటోలు వైర‌ల్‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-19 12:49:12  IST  )

పలాష్ పెద్ద చీటర్ అని వార్తలు రావడంతోనే, పెళ్లి క్యాన్సిల్ అయినట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే, పెళ్లి రద్దు అయిన తర్వాత

ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇంకా తీయ‌లేదా? స్మృతి ఫోటోలు వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత లేడీ క్రికెటర్ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ కోహ్లీగా పేరు తెచ్చుకున్న స్మృతి మందాన, భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నారు. మొదటి వరల్డ్ కప్ సమయంలో కూడా భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. అయితే అలాంటి స్మృతి మందాన పర్సనల్ లైఫ్ చాలా వివాదంగా మారింది. మొన్న నవంబర్ లో జరగాల్సిన స్మృతి మందాన వివాహం పీటల మీద ఆగిపోయిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఈ వివాహం ఆగిపోయింది.

పలాష్ పెద్ద చీటర్ అని వార్తలు రావడంతోనే, పెళ్లి క్యాన్సిల్ అయినట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే, పెళ్లి రద్దు అయిన తర్వాత తొలిసారిగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో స్మృతి మందాన మెరిశారు. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్ రింగ్ తోనే స్మృతి మందాన కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎంగేజ్మెంట్ రింగుతో స్మృతి మందాన కనిపించడంతో, పలాష్ తో ఇంకా డేటింగ్ లోనే ఉన్నట్లు కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో మళ్లీ వీళ్ళ వివాహం జరుగుతుందని మరి కొంతమంది అంటున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం అది ఎంగేజ్మెంట్ రింగ్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story