- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smriti Mandhana: ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న లేడీ కోహ్లీ
స్మృతి మందాన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన గుర్తుగా ప్రత్యేకంగా ఓ టాటూను వేయించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాలో లేడీ కోహ్లీగా దూసుకు వెళ్తున్న స్మృతి మందాన ( Smriti Mandhana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఓపెనర్ గా బరిలోకి దిగి జట్టుకు ఎన్నో విజయాలను అందించారు స్మృతి మందాన. మొన్న జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో కూడా తన వంతు పాత్ర పోషించి జట్టును విజేతగా నిలిపారు. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన నేపథ్యంలో స్మృతి మందాన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
వరల్డ్ కప్ గెలిచిన గుర్తుగా ప్రత్యేకంగా ఓ టాటూను వేయించుకున్నారు. వరల్డ్ కప్ తో పాటు జాతీయ జెండా ప్రతిబింబించేలా టాటూలు తన చేతి పైన వేయించుకున్నారు స్మృతి మందాన. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఇప్పటికే టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఇలాంటి టాటూనే వేయించుకున్నారు. ఇప్పుడు స్మృతి మందాన కూడా అదే బాటలో నడిచారు. కాగా స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 20వ తేదీన అంటే ఎల్లుండి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.






