నెంబర్ వన్ బ్యాటర్‌గా స్మృతి కంటిన్యూ.. టాప్-3లోకి దూసుకొచ్చిన దీప్తి!

by Phanindra |

నెంబర్ వన్ బ్యాటర్‌గా స్మృతి కంటిన్యూ అవుతోంది. వరల్డ్ కప్‌లో రాణించిన ఆమె రేటింగ్ పాయింట్లు భారీగా మెరుగయ్యాయి.

నెంబర్ వన్ బ్యాటర్‌గా స్మృతి కంటిన్యూ.. టాప్-3లోకి దూసుకొచ్చిన దీప్తి!
X

దిశ, స్పోర్ట్స్: వన్డే క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్ స్మృతి మంధాన కొనసాగుతోంది. మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కూడా రాణిస్తున్న ఈ టీమిండియా ఓపెనర్.. తాజాగా విడుదల చేసిన ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన స్మృతి 83 రేటింగ్ పాయింట్లు సాధించింది. మొత్తంగా 809 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో 726 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్‌ ఉంది. టాప్ టెన్‌లో మరో భారతీయ బ్యాటర్ లేకపోవడం గమనార్హం.

బౌలర్లలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకును చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో ఉన్న ఏకైక భారతీయురాలు ఆమే కావడం గమనార్హం. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్సెల్‌టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మరో భారతీయురాలు స్నేహ్ రాణా 20వ ర్యాంకులో నిలిచింది. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ యాష్లీ గార్డనర్ తొలి స్థానంలో, దీప్తి శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. వారి ర్యాంకుల్లో ఎలాంటి మార్పులు రాలేదు.

Next Story