28 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మందాన

by velandi.Saikiran |

టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన ( SMRITI MANDHANA ) సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డే క్రికెట్ లో 28 సంవత్సరాల

28 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మందాన
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన ( SMRITI MANDHANA ) సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డే క్రికెట్ లో 28 సంవత్సరాల రికార్డు నమోదు చేశారు. ఒకే క్యాలెండరు ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా స్మృతి మందాన వన్డేల్లో చరిత్ర సృష్టించారు. ఈ 2025 సంవత్సరంలో జరిగిన వన్డేల్లో మొత్తం 973 పరుగులు సాధించి, ప్రపంచంలోనే ఒకే సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మొదటి స్థానంలో నిలిచారు స్మృతి మందాన.

1997 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండర్ క్లర్క్ 970 పరుగులు చేశారు. ఆ తర్వాత ఈ మైలురాయిని ఎవరు అందుకోలేకపోయారు. కానీ 28 సంవత్సరాల తర్వాత ఈ క్ల‌ర్క్‌ రికార్డును బ్రేక్ చేశారు స్మృతి మందాన. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఇవాళ విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా స్మృతి మందాన ఈ రికార్డు సృష్టించారు. కాగా ఈ మ్యాచ్ లో 23 పరుగులకే స్మృతి మందాన అవుటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా 15 ఓవర్లు ఆడి 73 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయింది.

Next Story