టీ20ల్లో ఆ రికార్డు నెలకొల్పిన స్మృతి మంధాన.. ఏకైక భారత క్రికెటర్‌గా ఘనత

by Harish |   (  Updated:2025-12-22 11:31:02  IST  )

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టీ20 కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకుంది.

టీ20ల్లో ఆ రికార్డు నెలకొల్పిన స్మృతి మంధాన.. ఏకైక భారత క్రికెటర్‌గా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టీ20 కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకుంది. పొట్టి ఫార్మాట్‌లో 4 వేల రన్స్ పూర్తి చేసింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 25 రన్స్ చేయడంతో ఆమె ఈ ఫీట్ సాధించింది. దీంతో టీ20ల్లో 4,000 రన్స్ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే, 3,227 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న ఆమె ఫాస్టెస్ట్‌గా 4 వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మొత్తం 148 ఇన్నింగ్స్‌ల్లో 4,007 రన్స్ చేసింది. మహిళల టీ20ల్లో అత్యధిక రన్స్ రెండో బ్యాటర్‌గా స్మృతి కొనసాగుతోంది. న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ 4,716 రన్స్ తో అగ్రస్థానంతో ఉంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(3,654) మూడో స్థానంలో ఉంది.

Next Story