ICC Rankings : కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ పొందిన స్మృతి మంధాన

by Harish |

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో నం.1 బ్యాటర్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

ICC Rankings : కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ పొందిన స్మృతి మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వన్డేల్లో కెరీర్‌లోనే బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించింది. ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. స్మృతి టాప్ పొజిషన్‌ను నిలబెట్టుకోవడంతోపాటు 818 రేటింగ్ పాయింట్స్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌లో రాణించడంతో ఆమె రేటింగ్ పాయింట్స్ మెరుగుపర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు సహా 300 రన్స్ చేసింది.

ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌కు చేరుకుంది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా ఆమె రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 5వ ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ విభాగంలో 4వ స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమిమా రోడ్రిగ్స్ తమ స్థానాలను కోపాడుకోలేకపోయారు.హర్మన్ 2 స్థానాలు దిగజారి 14వ స్థానానికి, రోడ్రిగ్స్ 5 స్థానాలు పడిపోయి 20వ ర్యాంక్‌కు పడిపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ తాజ్‌మిన్ బ్రిట్స్ ఏకంగా 15 స్థానాలు వెనక్కినెట్టి 6వ ర్యాంక్‌కు దూసుకెళ్లడం గమనార్హం. ఆల్‌రౌండర్ విభాగంలో స్నేహ్ రాణా ఏకంగా 13 స్థానాలు అధిగమించి 41వ ర్యాంక్‌కు చేరుకుంది.

Next Story