- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి వాయిదా తర్వాత స్మృతి మందాన తొలి పోస్ట్
పలాష్ ముచ్చల్ ఫ్యామిలీ మాత్రం పెళ్లి జరుగుతుందని పదేపదే చెబుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో స్మృతి మందాన

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళల జట్టు ప్లేయర్ స్మృతి మందాన, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం ఇటీవల ఆగిపోయిన సంగతి తెలిసిందే. నవంబర్ చివరలో జరగాల్సిన ఈ పెళ్లి, స్మృతి మందాన తండ్రి గుండెపోటు కారణంగా ఆగిపోయింది. అయితే ఈ పెళ్లి ఆగిపోయిన తర్వాత పలాష్ ముచ్చల్ క్యారెక్టర్ పైన అనేక రకాల వార్తలు వచ్చాయి. అతని వల్లే పెళ్లి ఆగిపోయిందని కూడా కొంత మంది ప్రచారం చేశారు. ఇప్పటి వరకు కూడా అసలు వీళ్ల పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మళ్లీ జరుగుతుందా ? లేదా? అనే ప్రశ్నల పై ఎవరు కూడా స్పందించడం లేదు.
పలాష్ ముచ్చల్ ఫ్యామిలీ మాత్రం పెళ్లి జరుగుతుందని పదేపదే చెబుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో స్మృతి మందాన షాకింగ్ పోస్ట్ పెట్టారు. పెళ్లి ఆగిపోయిన తర్వాత ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు స్మృతి మందాన. ఇందులో స్మృతి మందాన చేతికి ఉంగరం లేకపోవడం హాట్ టాపిక్ అయింది. దీంతో పలాష్ ముచ్చల్ తో తన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఎంగేజ్మెంట్ జరగకముందు స్మృతి ఈ వీడియోను చేసి ఉంటారని అంటున్నారు. దీంతో స్మృతి మందాన చేసిన పోస్టు బాగా వైరల్ అవుతుంది. క్లిక్






