2025 అలాంటి అనుభవాలు మిగిల్చింది... స్మృతి మంధాన పోస్ట్‌ వైరల్‌

by Ajay Maddhiboyina |

టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

2025 అలాంటి అనుభవాలు మిగిల్చింది... స్మృతి మంధాన పోస్ట్‌ వైరల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. 2025లో తాను సాధించిన విజ‌యాలు, కుటుంబంతో, స్నేహితుల‌తో గడిపిన ఆనంద క్ష‌ణాలకు సంబంధించిన ఫోటోల రీల్ ను స్మృతి షేర్ చేసింది. వీడియో తాను జిమ్ చేసిన ఫోటోల‌తో పాటు ఇత‌ర ఫోటోలు సైతం ఉన్నాయి. అంతే కాకుండా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్ లో గెల‌వ‌డంతో క‌ప్ టాటూ వేసుకున్న ఫోటో సైతం ఉంది. ఇక‌ స్మృతి పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

అయితే 2025 ఆమెకు తీపి జ్ఞాప‌కాల‌ను అందించ‌డంతో పాటు చేదు అనుభ‌వాల‌ను సైతం మిగిల్చింది. 2025లో స్మృతి సంగీత ద‌ర్శ‌కుడు ప‌లాష్ ముచ్చ‌ల్ ను ప్రేమించ‌గా వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లింది. న‌వంబ‌ర్ 23న ఆమె పెళ్లి డేట్ సైతం ఖ‌రారైంది. కానీ ఇంత‌లో ప‌లాష్ మ‌చ్చ‌ల్ మంచివాడు కాదని, అత‌డు ఓ యువ‌తితో స‌న్నిహితంగా మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వివాహం క్యాన్సిల్ అయింది. తాజాగా స్మృతి వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో ఆమె అభిమానులు, నెటిజ‌న్లు ఈ ఏడాది ఆమెకు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story