పలాష్ మంచంపై ఆమెతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.. స్మృతి మంద‌న స్నేహితురాలు షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-24 10:45:04  IST  )

భార‌త క్రికెట‌ర్ స్మృతి మంధాన‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాష్ మ‌చ్చ‌ల్ వివాహం పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారింది.

పలాష్ మంచంపై ఆమెతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.. స్మృతి మంద‌న స్నేహితురాలు షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: భార‌త క్రికెట‌ర్ స్మృతి మంధాన‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాష్ ముచ్చ‌ల్ వివాహం పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారింది. వీరిద్ద‌రూ ఎందుకు విడిపోయారో తెలియక అభిమానులంతా షాక్ అయ్యారు. పలాష్ మ‌రో యువ‌తితో చేసిన చాటింగ్ వ‌ల్ల‌నే ఇద్ద‌రూ విడిపోయార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాగా తాజాగా స్మృతి మంధానా చిన్న‌నాటి స్నేహితురాలు విద్య‌న్ మానే సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. ఓ ఇంట‌ర్వ్యూలో విద్య‌న్ మానే మాట్లాడుతూ.. ఓ యువ‌తితో ప‌లాష్ ముచ్చ‌ల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడ‌ని చెప్పింది.

తాను పెళ్లి వేడ‌క‌లో ఉన్నాన‌ని నవంబ‌ర్ 23న ప‌లాష్ మ‌రో యువ‌తితో రెడ్ హ్యాండెడ్ గా మంచంపై ప‌ట్టుబ‌డ్డాడ‌ని చెప్పింది. అలా చూసిన వెంట‌నే భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు కోపంతో అత‌డిపై దాడి చేశార‌ని చెప్పింది. వాళ్ల కుంటుంబం మొత్తం దొంగ‌ల కుటుంబ‌మే అంటూ ఆరోపించింది. అత‌డు పెళ్లి చేసుకుని సాంగ్లిలో స్థిర‌ప‌డ‌తాడ‌ని అనుకున్నామ‌ని కానీ ఆ ఘ‌ట‌న‌తో ఎదురుదెబ్బ త‌గిలింద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం స్మృతి ఫ్రెండ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో మ‌రోసారి ప‌లాష్ పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.

Read More... ప్రూఫ్ చూపించండి.. స్మృతి మంధాన స్నేహితుడికి ప‌లాష్ లాయ‌ర్ వార్నింగ్

Next Story