- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్.. అర్జెంటీనా మాజీ ప్లేయర్ మారిజ్నేకు పగ్గాలు
భారత మహిళల హాకీ జట్టుకు నెదర్లాండ్స్‌కు చెందిన స్జోర్డ్ మారిజ్నే మళ్లీ చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టుకు నెదర్లాండ్స్‌కు చెందిన స్జోర్డ్ మారిజ్నే మళ్లీ చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అతన్ని హెడ్ కోచ్‌గా నియమించినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. చీఫ్ కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్ ఆటగాళ్లపై వేధింపులు, శిక్షణ సరిగ్గా లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో రాజీనామా చేశాడు. నెల రోజుల తర్వాత హాకీ ఇండియా మారిజ్నేకు బాధ్యతలు అప్పగించింది. గతంలో 2017 నుంచి 2021 వరకు మహిళల జట్టుకు అతను హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అతని హయాంలో జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక 4వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచింది.
అర్జెంటీనా మాజీ మిడ్ ఫీల్డర్ అయిన మారిజ్నే 2000 సిడ్నీ ఒలింపిక్స్, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. గత రెండు దశాబ్దాలుగా కోచింగ్ ఇస్తున్నాడు. అలాగే, డాక్టర్ వేన్ లాంబార్డ్ కూడా భారత హాకీకి తిరిగి వస్తున్నారు. ఆయన సైంటిఫిక్ అడ్వైజర్‌గా, అథ్లెటిక్స్ పర్ఫామెన్స్ హెడ్‌గా ఉంటారు. హెడ్ కోచ్‌గా మారిజ్నేకు మార్చిలో జరగబోయే మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ బిగ్ చాలెంజ్. ఈ టోర్నీ హైదరాబాద్ వేదికగా మార్చి 8 నుంచి 14 వరకు జరగనుంది. మారిజ్నే పర్యవేక్షణలో ఈ నెల 19 నుంచి బెంగళూరులోని జాతీయ కోచింగ్ క్యాంప్ ప్రారంభంకానుంది.






