- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 క్రికెట్లో ఆ నలుగురే తోపులు!
టీ20 క్రికెట్ చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఇప్పుడు డారియస్ విస్సర్ పేరిట చేరింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఇప్పుడు డారియస్ విస్సర్ పేరిట చేరింది. అయితే వనాటు జట్టుతో జరిగిన మ్యాచ్ లో నిపికో వేసిన ఓవర్లో డారియస్ 39 పరుగులు చేశాడు.అందులో 6 సిక్సులు, 3 నో బాల్స్ రూపంలో పరుగులు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర నమోదు చేశాడు డారియస్. అందులోనే ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు బ్యాట్స్ మెన్స్ మాత్రమే ఈ రికార్డును నెలకొల్పారు. వారిలో మొదటివాడు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. యువరాజ్ తర్వాత కీరన్ పొల్లార్డ్ శ్రీలంకన్ బౌలర్ ధనుంజయ్ ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత నేపాలీ బ్యాట్స్ మెన్ దీపేంద్ర సింగ్ ACC ప్రీమియర్ లీగ్ లో.. ఖతార్ లో జరిగిన మ్యాచ్ లో కమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను కొట్టాడు. ఆ తర్వాత రీసెంట్ గా ప్రపంచ కప్ తూర్పు ఆసియా పసిఫిక్ జోన్ క్వాలిఫయర్ లో సమోవా బ్యాట్స్ మెన్ డారియస్ విస్సర్ ఈ ఘనత ను సాధించాడు. వనాటు టీమ్ పేసర్ నలిన్ నిపికో బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు వరుస బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో దుమ్ము లేపాడు విస్సర్.






