- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచి సత్తాచాటుతున్న ఈ భారత జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్ జోడీ ఏకంగా వరల్డ్ నం.1 జంటకు షాకిచ్చింది. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్ అయిన సౌత్ కొరియాకు చెందిన కిమ్ వాన్ హో-సియో సియోంగ్ జో ద్వయంపై 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. 52 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జంటలు హోరాహోరీగా తలపడ్డాయి. రెండు గేములు రసవత్తరంగానే సాగాయి. కానీ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చిన సాత్విక్, చిరాగ్ సంచలన విజయాన్ని నమోదు చేసి సింగపూర్ ఓపెన్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ పోరాటం ముగిసింది. సెమీస్‌లో ఈ భారత జంట 16-21, 21-17, 13-21 తేడాతో జపాన్‌కు చెందిన హోబారా-షిమోగమి ద్వయం చేతిలో పరాజయం పాలై ఇంటిదారిపట్టింది.






