- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. సింగపూర్ ఓపెన్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన ఈ భారత జంట పురుషుల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తమ కెరీర్‌లో సింగపూర్ ఓపెన్ విజేతగా నిలవడం కూడా ఇదే తొలిసారి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్-ముహమ్మద్ ఫిక్రి ద్వయాన్ని ఓడించింది. ఈ విజయం సాత్విక్, చిరాగ్‌లకు అంత సులభంగా దక్కలేదు. గంటా 13 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేము కోల్పోవడంతో ఆరంభంలోనే వారికి పెద్ద షాక్ తగిలింది. కానీ, ఆ ఎదురుదెబ్బ నుంచి సాత్విక్, చిరాగ్ పుంజుకున్న తీరు అద్భుతం. ఆ తర్వాత కూడా ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనప్పటికీ వారు పట్టుదల ప్రదర్శించారు. ఇండోనేషియా జోడీకి కళ్లెం వేస్తూ వరుసగా 2, 3 గేముల నెగ్గి టైటిల్ సొంతం చేసుకున్నారు.






