వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ను ఆప లేకపోయాం - జింబాబ్వే కెప్టెన్

by velandi.Saikiran |

వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ను ఆప లేకపోయామంటూ జింబాబ్వే కెప్టెన్ ర‌జా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ను ఆప లేకపోయాం - జింబాబ్వే కెప్టెన్
X

దిశ‌, వెబ్ డెస్క్: జింబాబ్వేపై నిన్న వైభవ్ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కేవలం 18 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అయితే వైభవ్ దెబ్బకు చిత్తుగా ఓటమిపాలైంది జింబాబ్వే. ఇక నిన్నటి వైభవ్ ఇన్నింగ్స్‌ పై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన కుర్రాడ‌ని తెలిపారు.

ఇంత చిన్న వయసులో అతను ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం నోటితో చెప్ప‌లేనిది అంటూ వ్యాఖ్యానించారు. అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయాలన్నది త‌న ప్రణాళిక, కానీ త‌న ప్లాన్స్ బెడిసికొట్టాయ‌ని తెలిపారు. వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌న‌కు తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌న్నారు. బౌల‌ర్లు కూడా చేతులెత్తేశార‌ని వివ‌రించారు. తొలి మ్యాచ్ లో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ను ఆప లేకపోయాం కానీ, రెండో టీ20లో తొంద‌ర‌గానే ఔట్ చేస్తామ‌ని తెలిపారు.

Next Story