- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవుటైన ప్రస్టేషన్‌లో బ్యాటును నేలకేసి కొట్టిన పాక్ బ్యాటర్.. వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ
ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో షాక్ తగిలింది. ఆ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ సిద్రా అమిన్ ఐసీసీ నిబంధనను ఉల్లంఘించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆగ్రహానికి గురైంది. పాక్ బ్యాటింగ్‌లో సిడ్రా మాత్రమే రాణించింది. 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. అయితే, ఆమెను స్నేహ్ రాణా అవుట్ చేసింది. అవుటైన ప్రస్టేషన్‌లో సిద్రా బ్యాటును నేలకేసి కొట్టింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలు దుర్వినియోగం చేయడం నేరం. దీని ప్రకారం సిద్రా లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. నేరాన్ని సిద్రా కూడా అంగీకరించింది. దీంతో ఐసీసీ ఆమెను మందలించడంతోపాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది.






