ShbmnaGill: కోహ్లీ స్థానాన్ని గిల్‌ భర్తీ చేయగలడా? భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగే సత్తా ఈ కుర్రాడికి ఉందా?

by Vennela |

ShbmnaGill : గిల్ బ్యాటింగ్‌లో ఉన్న అడాప్టబిలిటీ అతని బిగ్గెస్ట్ ప్లస్.

ShbmnaGill: కోహ్లీ స్థానాన్ని గిల్‌ భర్తీ చేయగలడా? భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగే సత్తా ఈ కుర్రాడికి ఉందా?
X

దిశ,వెబ్‌డెస్క్: ShbmnaGill : గిల్ బ్యాటింగ్‌లో ఉన్న అడాప్టబిలిటీ అతని బిగ్గెస్ట్ ప్లస్. పిచ్ ఎలాంటిదైనా, పరిస్థితి ఎలా ఉన్నా, తన షాట్లను, టెంపోను మార్చుకునే తీరు, టీమిండియాలో చాలా తక్కువ మంది ప్లేయర్ల దగ్గరే ఉంది.

టీమిండియా నెక్ట్స్ బ్యాటింగ్ సూపర్‌స్టార్ ఎవరు? అందరూ చెబుతున్న పేరు ఒక్కటే.. శుభ్‌మన్ గిల్! విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలంగా నెంబర్-3 స్థానాన్ని పరిపూర్ణంగా ఏలుతున్నా, ఇప్పుడా కుర్చీపై గిల్ కూర్చొనే సమయం దగ్గరపడింది. అతని బ్యాటింగ్‌ స్టైల్, టెక్నిక్, క్రీజ్‌లో కనపడే కూల్ అప్రోచ్.. ఇవన్నీ అతడిని టీమిండియాకు నెక్స్ట్ ఫేస్‌గా మార్చేలా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్ చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ, శ్రేయస్ విఫలమైన చోట ఒత్తిడిని తట్టుకుంటూ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ను గెలిపించాడు. ఇది ఒక రకంగా కోహ్లీ తరహా చేజింగ్ మాస్టర్‌ క్లాస్!

ఒకప్పుడు, టీమిండియా వన్డే విజయాల్లో కోహ్లీదే కీలక పాత్ర. 2012-2019 మధ్యకాలంలో, ముఖ్యంగా ఛేజింగ్‌లో అతను ఓ యంత్రంలా పరుగులు సాధించేవాడు. హోమ్, ఓవర్సీస్ తేడా లేకుండా, బౌలర్ ఎవరైనా కోహ్లీకి ఒక్కటే. కానీ కొన్ని సీజన్లుగా విరాట్ ఫామ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఐదో స్టంప్ బంతులను టచ్ చేసి మరీ అవుట్ అవుతున్నాడు. ఇప్పుడు ODIల్లోనూ అదే బలహీనతను బయటపెడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. బౌలర్లు అతనిని బుట్టలో వేసుకోవడం చాలా ఈజీగా మారిపోయిది. అటు అభిమానులు, విశ్లేషకులు అతని ఆటలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు.

ఇదే సమయంలో గిల్ దుమ్మురేపుతున్నాడు. రెండేళ్లుగా అతని ఆటతీరు చూస్తుంటే, భారత క్రికెట్‌కు మరో గొప్ప బ్యాటర్ దొరికినట్టుగానే అనుకోవచ్చు. టాలెంట్, సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌, నిలకడ, క్రియేటివ్ స్ట్రోక్ ప్లే.. ఇవన్నీ అతడిని ఫ్యూచర్ టీమిండియా పిలర్‌గా మార్చేస్తున్నాయి. గిల్ బ్యాటింగ్‌లో ఉన్న అడాప్టబిలిటీ అతని బిగ్గెస్ట్ ప్లస్. పిచ్ ఎలాంటిదైనా, పరిస్థితి ఎలా ఉన్నా, తన షాట్లను, టెంపోను మార్చుకునే తీరు, టీమిండియాలో చాలా తక్కువ మంది ప్లేయర్ల దగ్గరే ఉంది. ఇది గతేడాది జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌ల్లో స్పష్టంగా కనిపించింది. అయితే కోహ్లీ తరహా స్టార్‌డమ్ రావాలంటే, మరికొన్ని ఏళ్లు ప్రయత్నించాల్సిందే.


Next Story