కెప్టెన్ గా గిల్...కమిన్స్, బెన్ స్టోక్స్ రికార్డ్స్ బ్రేక్

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... సోషల్ మీడియాలో.. గిల్ కు ఫాలోవర్స్

కెప్టెన్ గా గిల్...కమిన్స్, బెన్ స్టోక్స్ రికార్డ్స్ బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... సోషల్ మీడియాలో.. గిల్ కు ఫాలోవర్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్రికెట్ ఆడే అన్ని దేశాల కెప్టెన్ల కంటే... శుభమాన్ గిల్ ఫాలోవర్స్ అత్యధికంగా ఉన్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కు కూడా గిల్ కు ఉన్నంత ఫాలోవర్స్ ఎవరూ లేరు.

ప్రస్తుతం గిల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 16.3 మిలియన్స్ గా ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కు మూడు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. బెన్ స్టోక్స్ కు 2.9 మిలియన్స్, టెంబా బావుమా కు 234 K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అటు శ్రీలంక కెప్టెన్ డి సిల్వ కు 184 k, న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతం కు 103k ఫాలోవర్స్ ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే... ఫాలోవర్స్ విషయంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు.

ఇది ఇలా ఉండగా... టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో... ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది టీం ఇండియా. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్ వేదికగా జూన్ 20వ తేదీన ప్రారంభం కానుంది. జూలై రెండవ తేదీన రెండో టెస్టు, పదో తేదీన మూడవ టెస్టు, జూలై 23న నాలుగో టెస్ట్ అలాగే జులై 31వ తేదీన 5వ టెస్టు జరగనుంది.

Next Story