- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్మప్ మ్యాచులకు గిల్ దూరం?.. ఐపీఎల్ ఫైనల్ వల్లేనా?
ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు జరిగే వార్మప్ మ్యాచులకు గిల్ దూరం అవుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ వల్లనే ఈ కారణం తీసుకున్నారట.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు వార్మప్ కోసం భారత జట్టు రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచుల కోసం ఎంపిక చేసిన ఇండియా-ఎ జట్టు కొన్నిరోజుల్లోనే ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది. అయితే ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న జట్లలోని ప్లేయర్లు మాత్రం తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరం అవనున్నారు. వీళ్లంతా రెండో వార్మప్ మ్యాచ్ సమయానికి ఇంగ్లండ్ చేరుకుంటారు. అయితే వీరిలో కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం రెండో వార్మప్ మ్యాచులో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది.
ఐపీఎల్ పొడిగించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. అమితు జూన్ 6న రెండో వార్మప్ మ్యాచ్ మొదలవుతుంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ సారధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు కనుక ఐపీఎల్ చేరితే కచ్చితంగా జూన్ 3 వరకు భారత్‌లోనే గిల్ ఉండాల్సి వస్తుంది. ఐపీఎల్ ఫైనల్ ఆడిన వెంటనే ఇంగ్లండ్ బయలుదేరి, సరైన విశ్రాంతి లేకుండానే వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచులో గిల్‌కు విశ్రాంతినివ్వాలని, అతనిపై ఒత్తిడి పెట్టడం అనవసరమని బీసీసీఐ భావిస్తోందట. అయితే ఆ తర్వాత జరిగే ఇంట్రాస్క్వాడ్ మ్యాచులో గిల్ ఆడే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి మొదలవుతుందన్న సంగతి తెలిసిందే.






