- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. వారికి కూడా జట్టులో స్థానం
భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బాట పడుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్లు దేశవాళీ బాట పడుతున్నారు. ఈ నెలాఖరులో జరిగే దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ టోర్నీలో భాగంకానున్నాడు. కెప్టెన్ తొలి టెస్టు సిరీస్‌లోనే గిల్ ఇంగ్లాండ్ గడ్డపై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అతని నాయకత్వంలో భారత జట్టు ఐదో టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. 2019-20లో దులీప్ ట్రోఫీలో భారత బ్లూ జట్టుకు గిల్ సారథిగా వ్యవహరించాడు. జట్టులో గిల్‌తోపాటు పలువురు అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్‌లను నార్త్ జోన్ సెలెక్టర్లు జట్టులో చేర్చారు. హర్యానా బ్యాటర్ అంకిత్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్‌కు గిల్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణాలను ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లు వారికి రిప్లేస్‌మెంట్లను కూడా ప్రకటించారు. గిల్ స్థానంలో శుభమ్ రోహిల్లా, అర్ష్‌దీప్ స్థానంలో గుర్నూర్ బ్రార్, హర్షిత్ రాణా స్థానాలో అనుజ్ థక్రాల్ జట్టులోకి రానున్నారు. ఈ నెల 28 నుంచి క్వార్టర్ ఫైనల్స్‌తో దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అదే రోజు ఈస్ట్ జోన్‌తో నార్త్ జోన్ ఎదురుపడనుంది.






