- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత స్టార్ క్రికెటర్‌కు రెస్ట్?.. ఇషాన్ జట్టులోకి వస్తాడా?
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రస్తుతం టీమ్ ఇండియా సన్నద్ధమవుతున్నది. ఈ నెల 19 నుంచి 23 వరకు తొలి టెస్టు, ఈ నెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్లు మూడు టీ20ల సిరీస్ ఆడతాయి. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు సెలెక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తోంది. బంగ్లాతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో గిల్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
రోహిత్ సేన వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గిల్‌కు బంగ్లాతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినివ్వనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘అక్టోబర్ 7, 10, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 16వ తేదీన న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ప్రారంభంకానుంది. మధ్యలో మూడు రోజులు మాత్రమే ఉంది. కాబట్టి, గిల్‌కు విశ్రాంతిని ఇవ్వడం అవసరం.’ అని పేర్కొన్నాయి. రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఓపెనర్‌గా గిల్ మొదటి వరుసలో ఉన్నాడు. అతనికి విశ్రాంతినిస్తే ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రుతరాజ్ గైక్వాడ్‌కు కూడా జట్టులో చోటు దక్కే చాన్స్ ఉంది.