- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి టీ20కి గిల్ దూరమే..రంగంలోకి ఆ ప్లేయర్ ?
గిల్ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగుతాడని ప్రచారం సాగింది. కానీ చివరకి అసలు 4వ టీ20 మ్యాచ్

X
దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న గిల్, తాజాగా గాయం బారిన పడ్డాడు. దీంతో నిన్న లక్నో వేదికగా జరగాల్సిన మ్యాచ్ లో గిల్ ఆడటం లేదని ప్రకటన కూడా వచ్చింది. గిల్ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగుతాడని ప్రచారం సాగింది. కానీ చివరకి అసలు 4వ టీ20 మ్యాచ్ జరగకుండానే పొగ మంచు అడ్డుపడింది. ఈ తరుణంలో మ్యాచ్ రద్దు అయింది. అయితే, రేపు భారత్-దక్షిణాఫ్రికా చిట్ట చివరి టీ20 జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ మ్యాచ్ కు కూడా గిల్ దూరం కానున్నాడట. కాలి వేలికి గాయం కారణంగా దూరం కానున్నాడట. దీంతో మరోసారి గిల్ ప్లేస్ లో సంజుకే అవకాశం రానున్నట్లు సమాచారం అందుతోంది.
Next Story






