గిల్‌కు వైరల్ ఫీవర్.. దులీప్ ట్రోఫీకి దూరం!

by Harish |

త్వరలో ప్రారంభంకానున్న దులీప్ ట్రోఫీకి టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ దూరం కానున్నాడు.

గిల్‌కు వైరల్ ఫీవర్.. దులీప్ ట్రోఫీకి దూరం!
X

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 28నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ దేశవాళీ టోర్నీకి టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ దూరం కానున్నాడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు గిల్ కెప్టెన్‌గా నియామకమయ్యాడు. గిల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చండీగఢ్‌లోని తన నివాసంలో కోలుకుంటున్నాడు. ఇటీవల ఫిజియోథెరఫిస్ట్ టీమ్ అతన్ని పర్యవేక్షించి బీసీసీఐకి హెల్త్ నివేదికను అందజేసింది. దీనిపై నార్త్ జోన్ సెలెక్షన్ కమిటీ ఇంకా స్పందించకపోయినా గిల్ సన్నిహిత వర్గాలు మాత్రం అతను టోర్నీకి దూరమవుతున్నట్టు వెల్లడించాయి. గిల్ దూరమైతే వైస్ కెప్టెన్ అంకిత్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే, గిల్ స్థానాన్ని శుభమ్ రోహిల్లా భర్తీ చేయనున్నాడు. గిల్ ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియామకమైన విషయం తెలిసిందే. వచ్చే నెల 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో ఒకవేళ దులీప్ ట్రోఫీలో గిల్ పాల్గొన్న కేవలం ఓపెనింగ్ మ్యాచ్‌కే అందుబాటులో ఉండేవాడు. నార్త్ జోన్‌ జట్టుకు ఎంపికైన బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు కూడా కేవలం తొలి మ్యాచ్‌కే పరిమితం కానున్నారు. వారిద్దిరూ ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. వారి స్థానాలను గుర్నూర్ బ్రార్, అనుజ్ థక్రాల్ భర్తీ చేయనున్నారు.


Next Story