శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ.. 1971 తర్వాత రికార్డు

by velandi.Saikiran |   (  Updated:2025-07-05 14:55:19  IST  )

టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) మరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై..

శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ..  1971 తర్వాత రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) మరో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై.. రఫ్ఫాడిస్తున్నాడు గిల్. ఈ నేపథ్యంలోనే రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ నమోదు చేసుకున్న గిల్... ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో మరో సెంచరీ చేశాడు. 129 బంతుల్లో... రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒకే టెస్ట్ మ్యాచ్ లో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు లోకి ఎక్కాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు మొత్తం మూడు సెంచరీలతోపాటు ఒక డబల్ సెంచరీ కూడా నమోదు చేశాడు.

ఇక ఒకే టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు నమోదు చేసిన ఇండియన్ కెప్టెన్ గా గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ హోదాలో ఒకే టెస్టులో రెండు సెంచరీలు నమోదు చేసిన మూడవ ప్లేయర్ గా గిల్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఇదే రికార్డును సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ కూడా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ల సరసన గిల్ చేరాడు. అలాగే 1971 తర్వాత... ఓకే టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ, ఒక సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.

Next Story