- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమశిక్షణ, కష్టపడటమే లక్ష్యంగా భారత జట్టును నడిపిస్తా : గిల్
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియామకమైన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియామకమైన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత గిల్ ఆదివారం బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన కెప్టెన్సీ శైలి, ఇతర విషయాల గురించి మాట్లాడాడు. చిన్నతనంలో ఇండియాకు ఆడాలని, అందులోనూ సుదీర్ఘకాలం టెస్టులు ఆడాలని కలలు కనేవాడినని, ఇప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవమని చెప్పాడు. ప్రదర్శన ద్వారా మాత్రమే కాకుండా క్రమశిక్షణ, కష్టపడటమే లక్ష్యంగా భారత జట్టును నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు.
జట్టులోని ఆటగాళ్ల గురించి లోతుగా తెలుసుకోవడం కెప్టెన్‌గా చాలా అవసరమని చెప్పాడు. ‘ప్లేయర్లు విభిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. భిన్నంగా పెరిగారు. కాబట్టి, వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. క్రికెట్ కంటే లోతైన స్థాయిలో వారి గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో తెలుస్తుంది.’అని తెలిపాడు. అలాగే, రోహిత్, కోహ్లీల గురించి మాట్లాడుతూ..‘భారత దిగ్గజాల నుంచి స్ఫూర్తి పొందాను. అందులో కోహ్లీ భాయ్, రోహిత్ భాయ్‌లతో కలిసి ఆడే అవకాశం రావడం అదృష్టం. ఇద్దరివి భిన్నమైన స్టైల్. కానీ, ఇద్దరూ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయడం స్ఫూర్తిదాయం. కెప్టెన్‌గా కూడా ఇద్దరివి భిన్నమైన శైలి. కోహ్లీ భాయ్ దూకుడుగా ఉంటాడు. జట్టును గెలిపించాలనే ఆకలితో, ప్యాషన్‌తో టీమ్‌ను ముందుండి నడిపించాలనుకుంటాడు. రోహిత్ భాయ్ కూడా దూకుడుగానే ఉంటాడు. అలాగే, కూల్‌గా, వ్యూహాత్మకంగా కనిపిస్తాడు. ప్లేయర్లతో చాలా సంభాషిస్తాడు. రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్న లక్షణాలు కూడా అవే. రోహిత్, కోహ్లీ, అశ్విన్ మాకు విదేశాల్లో ఎలా గెలవాలో నేర్పించారు. ఇప్పుడు మేము అదే అమలు చేయాలి. విదేశాల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు.’అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌లో సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.






