లార్డ్స్ టెస్ట్ ఓటమికి కారణం అతనే.. కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్ !

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ తో జరిగిన లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా ఓడిపోవడంపై కెప్టెన్ గిల్ (SHUBMAN GILL ) స్పందించారు. తమ బ్యాటింగ్

లార్డ్స్ టెస్ట్ ఓటమికి కారణం అతనే.. కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ తో జరిగిన లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా ఓడిపోవడంపై కెప్టెన్ గిల్ (SHUBMAN GILL ) స్పందించారు. తమ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్ లో ఓడిపోయినట్టు వెల్లడించారు. మ్యాచ్ అనంతరం మీడియాను అడ్రస్ చేశారు గిల్. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ... నాలుగో రోజు చివరి గంట సమయంలో... మేము బాగా బ్యాటింగ్ చేసి ఉంటే.. మ్యాచ్ గెలిచే వాళ్ళమని తెలిపారు. అలాగే రవీంద్ర జడేజా పోరాటాన్ని గిల్ మెచ్చుకున్నారు.

సపోర్ట్ ఎవరూ లేకున్నా రవీంద్ర జడేజా ఒక వారియర్ లాగా... ఒంటరి పోరాటం చేశాడని ప్రశంసల జల్లు కురిపించాడు. అలాంటి ప్లేయర్ ప్రతి జట్టుకు ఉండాల్సిందేనని తెలిపాడు. ముఖ్యంగా రిషబ్ పంత్ (RISHABH PANT)... మొదటి ఇన్నింగ్స్ లో రన్ అవుట్ కావడం పెద్ద మైనస్ అయిందని వెల్లడించాడు గిల్. గాయమైనప్పటికీ కూడా.. రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు గుర్తు చేశారు.

కానీ అతడు రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఇవ్వాలా గెలిచే వాళ్ళమని వివరించారు. ఇది ఇలా ఉండగా... లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. చివరి వరకు పోరాడి.. 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. దీంతో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ముందంజలోకి వచ్చింది.

Next Story