టీమిండియా ఘోర‌ ఓట‌మి.. గిల్ మోటివేషనల్ పోస్ట్‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-26 21:15:35  IST  )

కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill ) తొలిసారిగా స్పందించారు. భారత జట్టు ఓటమి పాలు

టీమిండియా ఘోర‌ ఓట‌మి.. గిల్ మోటివేషనల్ పోస్ట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోవడంపై కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill ) తొలిసారిగా స్పందించారు. భారత జట్టు ఓటమి పాలు కావడంపై కాస్త ఎమోషనల్ అయ్యారు. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన భారత జట్టును ఉద్దేశించి చాలా ట్రోలింగ్ చేస్తున్నట్లు శుభ్‌మ‌న్ గిల్ పేర్కొన్నారు. ప్రశాంత సముద్రాలు ఎలా ముందుకు సాగాలో నేర్పించబోవని, కానీ తుఫాన్లు మాత్రం బలమైన చేతులను తయారు చేస్తాయంటూ అదిరిపోయే సందేశాన్ని పోస్ట్ చేశారు గిల్. తామంతా ఒకరినొకరం నమ్ముకుని ముందుకు సాగుతామని, ఇందులో గెలుపు, ఓటములు సహజమేనంటూ వెల్లడించారు. కానీ కాస్త ఓపిక పడితే, మంచి ఫలితాలు ఉంటాయి అంటూ అర్థం వచ్చేలా గిల్ పేర్కొన్నారు. దీంతో శుభ్‌మ‌న్ గిల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శుభ్‌మ‌న్ గిల్ కు మెడ నొప్పి.. టోర్నమెంట్ నుంచి ఔట్

దక్షిణాఫ్రికా వర్సెస్ భారత జట్టు మధ్య ఇటీవల ప్రారంభమైన టెస్టు సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మొదటి టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ చేసే క్రమంలో శుభ్‌మ‌న్ గిల్ మెడ పట్టేసింది. అప్పటి నుంచి వైద్యుల సమక్షంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు భారత కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్. అయితే ఈ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి శుభ్‌మ‌న్ గిల్ దూరమయ్యాడు. దీంతో రిషబ్ పంతుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అయితే గిల్ ఈ టెస్ట్ సిరీస్ ఆడి ఉంటే, ఫలితాలు తారుమారు అయ్యేవి. బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతోనే భారత జట్టు ఓడిపోయింది. అదే గిల్ ఆడి ఉంటే కచ్చితంగా భారత జట్టు గట్టి పోటీ ఇచ్చేది. కాగా నవంబర్ 30వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ భారత జట్టు మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు కూడా భారత కెప్టెన్ గిల్ దూరం అయిన సంగ‌తి తెలిసిందే.


Next Story