- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ రికార్డుల మోత.. కోహ్లీ, గవాస్కర్, సచిన్ రికార్డులు బద్దలు..!
ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ రికార్డుల మోత మోగించాడు. కోహ్లీ, గవాస్కర్, సచిన్ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు.

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచులో 114 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు బరిలో దిగిన గిల్ అదిరిపోయే ఆటతో ఆకట్టుకున్నాడు. మూడు సిక్సర్లు, 30 ఫోర్లతో 269 పరుగులు చేశాడు. అద్భుతమైన నియంత్రణలో కనిపించిన గిల్.. చెడ్డ బంతులన్నింటినీ బౌండరీలు తరలిస్తూ ఆకట్టుకున్నాడు. సాలిడ్ డిఫెన్స్ కూడా ప్రదర్శిస్తూ తనను ఎవరూ అవుట్ చేయలేరనే ధీమా కల్పించాడు. దీంతో అతను ట్రిపుల్ సెంచరీ చేసేస్తాడని అంతా అనుకున్నారు. కానీ టీ బ్రేక్ తర్వాత గిల్‌కు టంగ్ బ్రేకులు వేశాడు. షార్ట్ బాల్‌ను సరిగా అంచనా వేయలేకపోయిన గిల్.. స్క్వేర్ లెగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
రికార్డుల మోత
తన 269 పరుగుల ఇన్నింగ్సుతో గిల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. బర్మింగ్‌హాంలో 2018లో కోహ్లీ 149 పరుగులతో చెలరేగాడు. ఈ స్టేడియంలో ఇండియన్ బ్యాటర్ చేసిన టాప్ స్కోరు ఇదే. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డపై కూడా అత్యున్నత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. గవాస్కర్ 1979లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచులో 221 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు ఇది.
గతంలో కోహ్లీ (254 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును గిల్ చెరిపేశాడు. అలాగే 25 ఏళ్ల వయసులో విదేశాల్లో జరుగుతున్న ఒక సిరీసులో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలుకొట్టాడు. 1997లో శ్రీలంకలో పర్యటించిన సచిన్.. ఈ సిరీసులో 290 పరుగులు చేశాడు. గిల్ ఈ ఇంగ్లండ్ సిరీసులో ఇప్పటికే 323 పరుగులతో రెచ్చిపోయాడు. సేనా దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఏసియన్ కెప్టెన్‌గా కూడా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షాన్ (193) పేరిట ఉండేది. వీటితోపాటు ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టుల్లో రెండుసార్లు తొలి రోజునే సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు.
చివరి ఐదు వికెట్లకు
ఈ మ్యాచులో తొలి ఐదు వికెట్లు పడే సమయానికి భారత్ స్కోరు 211 మాత్రమే. అంటే చివరి ఐదు వికెట్లు కలిపి ఏకంగా 376 పరుగులు జతచేశారన్నమాట. చివరి ఐదు వికెట్లకు ఇన్ని పరుగులు చేయడం కూడా భారత్‌కు ఇదే తొలిసారి. చివరగా 2013లో వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో చివరి ఐదుగురు బ్యాటర్లు కలిసి 370 పరుగులు జతచేశారు.






