- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS SA: గిల్ కు మరో షాక్.. టీ20 సిరీస్ నుంచి కూడా ఔట్ ?
భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ( Shubman Gill ) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మెడనొప్పి కారణంగా దక్షిణాఫ్రికా

దిశ, వెబ్ డెస్క్: భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ( Shubman Gill ) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మెడనొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ కు దూరమైన శుభ్‌మన్ గిల్, ఇప్పుడు టి20లకు కూడా దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని మెడ నొప్పి ఇంకా తగ్గుముఖం పట్టలేదని సమాచారం అందుతోంది. దీంతో ఈ నెల 9వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరగనున్న టి20 సిరీస్ కు శుభ్‌మన్ గిల్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.
అయితే శుభ్‌మన్ గిల్ దూరమైతే అతని స్థానంలో రియాన్ పరాగ్ కు అవకాశం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అటు హార్దిక్ పాండ్యా మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 లకు అందుబాటులో ఉంటాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 టీ20లు జరుగనున్నాయి.
భారత టీ20 జట్టు అంచనా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్) లేదా రియాన్ పరాగ్, జితేష్ శర్మ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్,






