శుభ్‌మన్ గిల్‌పై వేటు.. సెలెక్టర్ల వివరణ ఇదే

by Malleboina Mahesh |   (  Updated:2025-12-20 09:22:51  IST  )

భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

శుభ్‌మన్ గిల్‌పై వేటు.. సెలెక్టర్ల వివరణ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ (BCCI) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, గత కొంతకాలంగా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill)కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Chief selector Ajit Agarkar) స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. "గిల్ అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ప్రస్తుతం అతను పరుగుల వేటలో కాస్త వెనుకబడ్డాడు. గత ప్రపంచకప్‌లోనూ విభిన్న కాంబినేషన్ల కారణంగా అతను త్రుటిలో అవకాశం కోల్పోయాడు. ఈసారి కూడా జట్టు అవసరాలు, కూర్పు దృష్ట్యా అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది" అని అగార్కర్ పేర్కొన్నారు.

15 మంది సభ్యులను ఎంపిక చేసేటప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుందని, ఈసారి ఆ పరిస్థితి దురదృష్టవశాత్తూ గిల్ విషయంలో ఎదురైందని అగార్కర్ వెల్లడించారు. గిల్ స్థానంలో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ (Ishan Kishan) జట్టులోకి రాగా, అక్షర్ పటేల్‌ (Axar Patel)ను కొత్త వైస్ కెప్టెన్‌ (Vice Captain)గా నియమించారు. కేవలం ఫామ్ మాత్రమే కాకుండా, మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడం, వికెట్ కీపింగ్ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. స్వదేశంలో జరిగే ఈ మెగా టోర్నీకి గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.

ప్రపంచకప్ భారత జట్టు (Squad): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజూ శాంసన్ (కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

Next Story