ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు

by Harish |

ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నాడు.

ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్.. తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న అతను నాలుగో టెస్టులో కూడా సెంచరీ బాదాడు. 103 రన్స్ చేసిన అతను సిరీస్‌లో మొత్తం 722 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. సేనా దేశాల్లో(ఇంగ్లాండ్,సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓ టెస్టు సిరీస్‌లో 700 రన్స్ చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇంతకుముందు సేనా దేశాల్లో అత్యధిక రన్స్ చేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు చేశాడు. తాజాగా కోహ్లీని గిల్ వెనక్కినెట్టాడు. అలాగే, ఇంగ్లాండ్ గడ్డపై 700 పరుగులు మార్క్ అందుకున్న తొలి బ్యాటర్ కూడా గిలే. సునీల్ గవాస్కర్(774, 732), యశస్వి జైశ్వాల్(712)ల తర్వాత ఓ టెస్టు సిరీస్‌లో 700 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగో శతకం నమోదు చేయడంతో గిల్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో సునీల్ గవాస్కర్(4), విరాట్ కోహ్లీ(4)‌లతో సంయుక్తంగా నిలిచాడు. అలాగే, కెప్టెన్‌గా ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ క్రికెటర్లు బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా), సునీల్ గవాస్కర్‌లను సమం చేశాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో బ్రాడ్‌మెన్(810) ఉన్నాడు.


Next Story