Shubman Gill: గిల్ సరికొత్త చరిత్ర.. టి20 లో అరుదైన ప్లేయర్ గా రికార్డ్

by velandi.Saikiran |   (  Updated:2025-05-18 17:21:50  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో శుభమన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 లలో 5000 పరుగులను పూర్త

Shubman Gill:  గిల్ సరికొత్త చరిత్ర.. టి20 లో అరుదైన ప్లేయర్ గా రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో శుభమన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 లలో 5000 పరుగులను పూర్తి చేసుకున్న టీమిండియా ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు గిల్. కేవలం 154 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు అందుకున్నాడు. టీమిండియా, ఐపీఎల్ టోర్నమెంట్లో కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించిన గిల్... 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో ఈ రికార్డు సృష్టించాడు గిల్.

ఇక ఈ మ్యాచ్ లో.. ఇప్పటివరకు 50కి పైగా పరుగులు చేశాడు గిల్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై చేజింగ్ చేసే క్రమంలో.. వికెట్ నష్టపోకుండా.. గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. 200 పరుగులు చేదించే క్రమంలో వికెట్ నష్టపోకుండా... 130కి పైగా పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్.

Next Story