- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్ కూతురుతో ఎఫైర్... ట్విస్ట్ ఇచ్చిన గిల్
లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin) కూతురు సారా టెండూల్కర్ తో ( Sara Tendulkar) డేటింగ్ లో ఉన్న వార్తలపై తాజాగా

దిశ, వెబ్ డెస్క్: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin) కూతురు సారా టెండూల్కర్ తో ( Sara Tendulkar) డేటింగ్ లో ఉన్న వార్తలపై తాజాగా టీమిండియా యంగ్ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ( Shubman Gill ) స్పందించారు. ఇప్పటి వరకు తాను ఎవరితో కూడా ప్రేమలో లేనని... మూడు సంవత్సరాలుగా సింగిల్ గానే ఉంటున్నానని... గిల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ నటి సారా, సారా టెండూల్కర్ ఇద్దరితో రిలేషన్ లో ఉన్నారనే వార్తలపై.... ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... వివరణ ఇచ్చారు గిల్.
ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ... తన విషయంలో అనేక రకాల రూమర్స్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నారు. కానీ తన పైన వస్తున్న వార్తల్లో ఒక్కటి కూడా నిజం లేదని వివరించారు. ఆ అమ్మాయితో, ఈ హీరోయిన్ తో ఇలా ఎంతో మందితో డేటింగ్ లో ఉన్నట్టు తనపై అనేక రకాల వార్తలు రాస్తున్నారని ఈ సందర్భంగా గిల్ మండిపడ్డారు. తాను మూడు సంవత్సరాలుగా సింగిల్ గానే ఉంటున్నానని తెలిపాడు. ఎవరితో అయినా ప్రేమలో పడితే ఖచ్చితంగా చెబుతానని కూడా వివరించారు.
ఇప్పటి వరకు తాను కలవని వ్యక్తులతో కూడా రిలేషన్ పెట్టి.. వార్తలు వైరల్ చేస్తున్నారని చురకలు అంటించారు. కానీ ఆ ఫేక్ వార్తలను ఎవరు నమ్మకూడదని కోరారు. ఇది ఇలా ఉండగా... సారా టెండూల్కర్, అలాగే గిల్ మధ్య రిలేషన్ ఉందని.... మొన్నటి వరకు వార్తలు వైరస్ అయ్యాయి. ఇక గత వారం రోజుల నుంచి... ఈ జంట గురించి మరో వార్త కూడా బయటకు వచ్చింది. గిల్ అలాగే సారా టెండూల్కర్ ఇద్దరు విడిపోయారని... సోషల్ మీడియా వేదికగా అన్ ఫాలో కూడా చేసుకున్నారని కూడా... ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.
Shubman Gill has finally said it about his dating rumours with sara tendulkar. pic.twitter.com/GrThDLxCoR
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025






