ఏడాదిలో 300 రోజులు ఆమెతో.. రిలేషన్‌షిన్‌షిప్ స్టేటస్‌పై శుభ్‌మన్ గిల్ క్లారిటీ

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు.

ఏడాదిలో 300 రోజులు ఆమెతో.. రిలేషన్‌షిన్‌షిప్ స్టేటస్‌పై శుభ్‌మన్ గిల్ క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను సింగిల్ అని తెలిపాడు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌లతో గిల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిల్ తనపై వచ్చిన రూమర్లను కొట్టిపారేశాడు.

తాను ఎవరితో రిలేషిన్‌షిప్‌లో లేనని స్పష్టం చేశాడు. ‘మూడేళ్లుకుపైగా నేను సింగిల్‌గా ఉంటున్నా. నన్ను వేర్వేరు వ్యక్తులతో ముడిపెట్టి చాలా రూమర్లు వచ్చాయి. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తులతో పుకార్లు పుట్టించినప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ వ్యక్తితో, ఈ వ్యక్తితో కలిసి ఉన్నాననే రూమర్లు కూడా విన్నాను. నేను నా ఫ్రొఫెషనల్ కెరీర్‌పైనే దృష్టి పెట్టా. ఏడాదిలో 300 రోజులు ఒక వ్యక్తితో ఉండటానికి నా దగ్గర సమయం లేదు.’ అని గిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గిల్ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. అతని నాయకత్వంలో దూకుడుగా ఆడుతున్న గుజరాత్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది.


Next Story