రాజ్‌కోట్ వన్డేలో సీన్ రివర్స్.. కివీస్ బౌలర్లను ఉతికారేస్తున్న శుభ్‌మన్‌ గిల్

by Kema Shiva Kumar |

రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్ (India) మొదట బ్యాటింగ్‌కు దిగింది.

రాజ్‌కోట్ వన్డేలో సీన్ రివర్స్.. కివీస్ బౌలర్లను ఉతికారేస్తున్న శుభ్‌మన్‌ గిల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్ (India) మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ప్రతిసారి నెమ్మదిగా ఆడే శుభ్‌మన్ గిల్ కివీస్ బౌలర్లపై రెచ్చిపోయాడు. ఏకంగా 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఒకవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న సహచరులు, నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్, శుభ్‌మన్ ఆటతీరును చూసి ఆశ్చర్యపోయారు. ఇక మరో ఎండ్‌లో రోహిత్ నెమ్మదిగా ఆడుతూ.. క్రిస్టియన్ క్లార్క్ (Christian Clark) బౌలింగ్‌లో 38 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 83 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ 43 బంతుల్లో 47, విరాట్ కోహ్లీ 6 బంతుల్లో 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్‌కు మాత్రమే ఒక్క వికెట్ దక్కింది.

Next Story