- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్ పగ్గాలు.. ఇంగ్లాండ్ స్పిన్నర్ సెన్సేషనల్ కామెంట్స్
ఇండియా (India), ఇంగ్లాండ్ (England) మధ్య ఈ నెల 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా (India), ఇంగ్లాండ్ (England) మధ్య ఈ నెల 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)పై ఇంగ్లీష్ టీమ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ మంచి కెప్టెన్ అవుతాడని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కెప్టెన్‌గా అతడిపై చాలా బాధ్యత ఉంటుందని.. అందుకే తొందర పడకుండా సంయమనంతో బ్యాటింగ్ చేస్తాడని తెలిపారు.
అయితే, అతడు తన కెరీర్‌లో మొత్తం 32 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడని 35.05 సగటుతో 1,893 పరుగులు చేశాడని గుర్తు చేశారు. అందులో ఐదు సెంచరీలు. ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయని తెలిపాడు. విదేశాల్లో గిల్ ప్రదర్శన అంత మెరుగ్గా లేదని.. ఇంగ్లాండ్‌లో ఆడిన మూడు టెస్ట్‌లలో కేవలం 88 పరుగులే చేశాడని అన్నారు. ఇక ఇంగ్లాండ్ టూర్‌లో కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టబోయే శుభ్‌మన్ గిల్‌కు ఇది ఓ సవాలేనని అన్నాడు. అనుభవం గల ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బేనని తెలిపాడు. ఆశించిన స్థాయిలో బ్యాట్స్‌మెన్లు రాణించకపోతే భారత్ కుప్పకూలే అవకాశం ఉందని పనేసర్ అన్నాడు.






