ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్.. గిల్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా ఘనత

by Harish |
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రేయస్ అయ్యర్.. గిల్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చికి సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కించుకున్నాడు. అయ్యర్ అవార్డు గెలిచినట్టు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ క్రికెటర్లు రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ కూడా పోటీపడగా.. వారిని వెనక్కినెట్టి అయ్యర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇటీవల భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ కీలక పాత్ర పోషించాడు. 5 మ్యచ్‌ల్లో 243 రన్స్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున టాప్ స్కోరర్ అతనే. ఈ ఏడాది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచిన రెండో భారత క్రికెటర్ అయ్యర్. ఫిబ్రవరిలో శుభ్‌మన్ గిల్‌కు అవార్డు దక్కింది. అవార్డు విజేత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలవం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమైంది. మేము చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మార్చి నెలను ఎప్పటికీ మర్చిపోలేం. చాంపియన్స్ ట్రోఫీ వంటి అతి పెద్ద వేదికపై భారత్ విజయానికి సహకరించాలనేది ప్రతి క్రికెటర్ కల. నాకు మద్దతుగా నిలిచిన సహచర ప్లేయర్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు.’అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

Next Story

Most Viewed