- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రేయస్ అయ్యర్‌కు గాయం.. 2-3నెలలు ఆటకు దూరం?
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2-3 నెలలు ఆటకు దూరం కానున్నట్టు తెలుస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2-3 నెలలు ఆటకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో నేలకు బలంగా తాకడంతో కడుపులో గాయమైంది. ప్లీహం చీలిపోయి, అంతర్గత రక్తస్రావం అయినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతను స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్ధివాలా పర్యవేక్షణలో ఉన్నాడు. ఇటీవల అతనికి అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ టెస్టు చేయించుకున్నాడు. నివేదిక ప్రకారం.. అయ్యర్ మెరుగ్గా కోలుకుంటునప్పటికీ ఫిట్‌నెస్ సాధించడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. కడుపుపై ఒత్తిడి పడేలా కఠినమైన వ్యాయమాలు చేయొద్దని అతనికి వైద్యులు సూచించారు. ఇప్పట్లో అతను మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు లేవు. త్వరలో జరగబోయే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌తోపాటు జనవరిలో జరిగే న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు అయ్యర్ దూరంకానున్నాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్-2026లో పాల్గొంటాడా?లేదా? చూడాలి. వచ్చే వారం అయ్యర్‌కు మరోసారి అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ చేయించుకోనున్నట్టు సమాచారం. రెండు నెలల తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరనున్నాడు.
- Tags
- Shreyas Iyer






