- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాకు గుడ్ న్యూస్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడటానికి భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. భారత జట్టులో చేరేందుకు అతనికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) క్లియరెన్స్ ఇచ్చింది. అయ్యర్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్టు ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా టూరులో గాయపడిన అయ్యర్ దాదాపు మూడు నెలలు ఆటకు దూరయ్యాడు. ఇటీవల కోలుకున్న అతన్ని సెలెక్టర్లు కివీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే, అతని ఫిట్‌నెస్‌తోపాటు సీవోఈ ఇచ్చే క్లియరన్స్‌పైనే అయ్యర్ పాల్గొనడం ఆధారపడి ఉంటుందని తెలిపారు. తాజాగా అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. ముంబై తరపున చివరి రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 రన్స్ చేశాడు. ఇక, గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 45 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో నిరూపించుకోవడంతో శ్రేయస్ అయ్యర్‌కు సీవోఈ క్లియరెన్స్ ఇచ్చింది. ఆదివారం భారత్, కివీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.






