Shreyas Iyer: సెంచరీ మిస్.. భారత్ 331/7

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-15 05:31:24  IST  )

బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్ ఆడుతున్న టీమిండియా రెండో రోజు ఆటలో గట్టిదెబ్బ తగిలింది.

Shreyas Iyer: సెంచరీ మిస్.. భారత్ 331/7
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్ ఆడుతున్న టీమిండియా రెండో రోజు ఆటలో గట్టి దెబ్బ తగిలింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (86) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. బంగ్లాదేశ్ పై 278/6 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీంఇండియా మరో 15 పరుగులు జోడించాక శ్రేయస్ వికెట్ కోల్పోయింది. తొలి రోజు పుజారా(90) సెంచరీ మిస్ చేజారిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట ప్రారంభమైన 8 ఓవర్ల వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడిన భారత్ ఎబాడట్ వేసిన అద్భుత బంతికి వికెట్ కోల్పోయింది. శ్రేయస్ క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. దీంతో 293 వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజుల్ రవిచంద్రన్ అశ్విన్(33), కుల్ దీప్ యాదవ్(11) ఉన్నారు.

Also Read..

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న Kane Williamson.

Next Story